Thursday, 28 May 2015

Top 10 secrets of Girl why their original pics post in FB after Marriage only ??? (please girls don't read)

అమ్మాయిలు పెళ్ళైన తర్వాత మాత్రమె,
తమ ఒరిజినల్ ఫోటో లు పెట్టడానికి గల కారణాలు : 
(ఓన్లీ ఫర్ బాయ్స్. ప్లీజ్ girls don't read )  

"""ఈ క్రింది కారణాలు ఎవరిని ఉద్ధేసించి  చెప్పినవి  కావు , కేవలం కల్పితం మాత్రమె .. ఎవరినైనా hurt చేసి ఉంటె sorry ....!!!"""   



1. ముఖ పుస్తకం లో, అదే భయ్యా పేస్ బుక్ లో కొంత మంది జఫ్ఫా గాళ్ళు ఉంటారు. భయ్యా వీళ్ళు, అందమైన అమ్మాయి ఫోటో లను కాపీ చేసి, వాళ్ళ లవర్ గా పాపులర్ చేస్తారు. అంతే కాదు, కొంత మంది పేస్ మర్పింగ్ చేసి చండాలంగా తయారు చేస్తారు. అందుకే వీళ్ళ లాంటి  వాళ్ళకి దూ.........రం గా ఉండటం కోసం, ఒరిజినల్ ఫోటో లు పెట్టరు.   




2. కొంత మంది అమ్మాయలకి తాము అందం గా ఉండరు అని, ఓ ఫీలింగ్ ఉంటుంది.ఇదో రకమైన ఫోబియా . సో ... ఇలా  ఉన్న వాళ్ళు కూడా, వారు ఒరిజినల్ ఫోటో లు పెట్టరు.. యింకొందరు ఉంటారు, భయ్యో... వీళ్ళు మరీను, వీళ్ళు చాల అందగత్తెలని, ఫోటోలు పెడితే ఫాన్స్ ఎక్కువైపోతారని,  ఒరిజినల్ ఫోటో లు పెట్టరు.




3. కొంత మంది అమ్మాయిలు ఉంటారు భయ్యా, వీళ్ళు అలంటి ఇలాంటి అమ్మాయిలు కాదు.  భయ్యో, పేరు కనిష్క, కాని ఫోటో అనుష్క.  ఊరు ఏదో ఒకటి, కాని పెట్టేది అమెరిక.  చాలా కొద్ది మంది అమ్మాయిలు ఇలా ఉంటారు, అబ్బాయిలని ఓ రేంజ్ లో ఆడుకుంటారు.  ఒరిజినల్ ఫోటో లు పెట్టరు.




4. కొంత మంది అమ్మాయిలు పెళ్లి అయ్యాకే ఫోటో లు పెట్టడానికి కారణం, ఎలాగో పెళ్లి అయిపోయింది , సో...., ఇంకేవాడు ట్రై చేయడు, ఇకనైనా తమ నిజస్వరూపం పెడదామని ఒరిజినల్ ఫోటో లు పెడతారు. sorry నిజం చెప్పేసా .. 






5. ఇంకొంత మంది ఉంటారు భయ్యా, పెళ్లి అయ్యాక ఫోటోలు పెడతారు, ఓ రేంజ్ లో పెడతారు.  వీళ్ళ ఇంటెన్సిటీ మాత్రం ఒకటే ఉంటుంది.  వీళ్ళని ఎవడైనా ఏడిపించిన వాడు, లేక లవ్ చేయని వాడు ఉంటె, చూడరా...  మా అయన ఎలా ఉన్నాడో, మేం ఎలా ఉన్నామో, అని వాడి దూల తీర్చడానికి కావాలని, పిచ్చ పిచ్చ పిచ్చ గా ఫోటోలు పోస్ట్ చేస్తారు .



యింక 6...7....8....9....10 కారణాలు నాకు ఐడియా లేదు ... మీకు తెలిస్తే నాకు చెప్పండి . 

ఇది చదివాక అమ్మాయిల face   ఇలా ఉంటుంది . 
అదే అబ్బాయలది అయితే   ఇలా ఉంటుంది .

నిజమైన అబ్బాయిలు అయితే దీనిని facebook లో post చేస్తారు . www.facebook.com

Thursday, 21 May 2015


The Great Banana :


Image result for banana skin moisture

1. Skin moisturizing
                   
Image result for banana skin moisture                 Bananas have vitamin A, which is helpful in restoring the lost moisture of your skin. All you need to do is: mash a ripe banana and apply the paste on your skin. Adding honey to the paste would give you an even better skin. Just avoid getting this paste in your eyes.





Wednesday, 13 May 2015

save your self from earth quack


భూకంపం వచ్చినపుడు మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలు ...





Saturday, 9 May 2015


అమ్మ ప్రేమ :

          సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ.... అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే ప్రేమంటే ఏంటో మొదట మనకు తెలిసేది తల్లి దగర నుండే ఆ తల్లి ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు. అది అనుభవించే వచ్చే ఓ తియ్యని వరం.

          అందుకేమో ఓ కవి అన్నాడు "ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్న తియ్యని కావ్యం , ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం అని" నిజంగానే "పెదవే పలికిన మాటల్లో తియ్యని మాటే అమ్మ".


" చంద్రుడు లోని చల్లదనం....
  ఉషస్సు లోని వెచ్చదనం....
  తేనె లోని తియ్యదనం.....
  అమృతం లోని మాదుర్యం......
  అమృతం లో "అ" అనే అక్షరాన్ని, మాధుర్యం "మా" అనే అక్షరాన్ని కలిపితే "అమ్మ"!!!!" 

 మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో మీ మణిkanta.

ఈ సందర్బంగా అమ్మ గురించి అమ్మ ప్రేమ గురించి ఓ చిన్న కథ ....


మాతృదినోత్సవం


 ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా ఎన్నో దేశాలు జరుపుకొంటున్నాయి.

మాతృదినోత్సవాన్ని జరుపుకునే దేశాలు... వివరాలు...

అమెరికా:  అమెరికాలో ఆ రోజున అందరూ తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఉత్సవాలు జరుపుకొంటారు. అమ్మ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. ప్రతి ఇంటిలోనూ జాతీయ పతాకాన్ని  ఆవిష్కరిస్తారు. ఇంటింటా పండగ వాతావరణం నిండిపోతుంది.

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కూడా మాతృదినోత్సవం ఘనంగా జరుపుతారు.

కెనడా:  కెనడా దేశంలో మాతృదినోత్సవం నాడు గులాబీరంగు దుస్తులు ధరిస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు.


న్యూజిలాండ్: న్యూజిలాండ్ దేశంలో మాతృదినోత్సవాన్ని ఒక పెద్ద వేడుకగా  నిర్వహిస్తారు. బహుమతులతో తమ పిల్లలను గౌరవించుకుంటారు. అమ్మమ్మలు, నానమ్మలను కూడా ఆ రోజున గౌరవిస్తారు. కేక్‌లు కోస్తారు. ఆ రోజున తల్లులకు విశ్రాంతి ఇచ్చి, ఇంటి పనులన్నీ పిల్లలే చేస్తారు.

ఐర్లాండు: ఐర్లాండులో మాతృదినోత్సవాన్ని మే నెలలో వచ్చే నాలుగో ఆదివారం, మెక్సికోలో మే నెల పదో తేదీన మాతృదినోత్సవం జరుపుకొంటారు. అన్ని పాఠశాలలలో ఈ వేడుకలను నిర్వహిస్తారు.

భారతదేశం: మన భారతదేశం విషయానికి వస్తే, తల్లిని పూజించే సంప్రదాయం యుగయుగాలుగా ఉంది. రామాయణ, భారత, భాగవతాలలోనూ మనకు తల్లిని గౌరవించే తీరు కనబడుతుంది. ఈ యుగంలోనూ ఎందరో సామ్రాజ్య అధినేతలు తమ తల్లులను ప్రతి సందర్భంలోనూ పూజించేవారున్నారు. దండయాత్రకు వెళ్ళినా, విజయం సాధించి వచ్చినా ముందుగా తల్లినీ, ఆ తర్వాత దైవాన్నీ పూజించేవారు. ఇక ఆధునిక యుగంలో మాతృదినోత్సవం సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఆరంభమైందని చెప్పవచ్చు.

ప్రతి పండగ సమయంలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ తల్లికి పాదాభివందనం చేసే పద్ధతి, ఆచారం మనకు ఉంది. అవన్నీ ఉండగా, ప్రత్యేకించి ఈ మాతృదినోత్సవం చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాల సంస్కృతిగా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు.ఏది ఏమైనా, ఏ దేశంలోనైనా భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారులను తన కడుపులో నవమాసాలు మోసి క్షేమంగా ఈ ప్రపంచానికి అందిస్తున్న అమ్మకు శతకోటి వందనాలు!

Monday, 4 May 2015

బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకా మీ ఇష్టం :

బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకా మీ ఇష్టం :
వోటర్ కార్డు కి ఆధార్ కార్డు ని అనుసందానం చేయాలనీ సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది దీనికి గడువు మార్చిలోపు అని ఇదివరకు తెలియ జేసారు కాని ఈ గడువును ఇంకా పెంచారు చివరి తేది ఇంకా తెలియదు. కావును తొందరగా అందరు వోటర్ కార్డు కి ఆధార్ కార్డు ని అనుసందానం చేయాలనీ లేని యెడల వాళ్ళ వోటర్ కార్డు ని రద్దు చేస్తారని తెలియజేయడం జరిగింది..

వోటర్ కార్డు కి ఆధార్ కార్డు ని అనుసందానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి  :
http://164.100.132.184/epic/SelfSeeding.jsp